| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంతర్జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌

అంతర్జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌

డైలీ భారత్, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28న గ్లోబల్‌ కార్పొరేట్‌ సమ్మిట్‌ 2023ని నిర్వహిస్తున్నారు.

రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సదస్సులో పరిశ్రమల రంగంలో పెట్టుబడులు, ఆర్థికపరమైన అంశాలు, భవిష్యత్తు వ్యూహాలు, సుస్థిరాభివృద్ధి, సంపద సృష్టి తదితర అంశాలపై చర్చించనున్నారు.

సౌత్‌ సుడాన్‌ ప్రధాని ప్రత్యేక సలహాదారు, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ దీపక్‌ వోహ్రా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఈ సదస్సుకు తెలంగాణ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పర్వీందర్‌ సింగ్‌ గౌరవ అతిధిగా పాల్గొంటున్నారు.

Previous తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం చరిత్రదాయకం: ఎమ్మెల్సీ కవిత
Next అధికారుల వేధింపులకు మహిళా కండక్టర్ ఆత్మహత్య?
ADVERTISEMENT