| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లాలో 144 సెక్షన్ అమలు : మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి

ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లాలో 144 సెక్షన్ అమలు : మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి

డైలీ భారత్, మెదక్:ఈ నెల 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 144 CrPC   సెక్షన్ అమలు 

జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి  

ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి   మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో శాంతిభద్రతలకు సంబందించి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తేది 11.05.2024 సాయంత్రం 6:00 గంటల నుండి తేది 14.05.2024 సాయంత్రం 6:00 గంటల వరకు జిల్లాలో 144 CrPC సెక్షన్ అమలులో ఉంటుంది  కావున జిల్లాలో ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దు, జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని  పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవ్వరు కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ  గుమికూడి ఉండవద్దు, పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఉన్న 100 మీటర్స్ లైన్స్ దాటి ఎవ్వరు లోపలికి రావద్దు. కావున జిల్లాలో ప్రజలు ఇట్టి విషయం పైన దృష్టి సారించి పోలీస్ అధికారులకు,సిబ్బందికి  సహకరించాలని, ఎవరైనా ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తే  వారిపైన, అలాగే నియోజక వర్గం కానీ ప్రజలు కానీ మొదలైన వారు ఉండకూడదని అలా ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తే అలా గురి చేస్తున్నారని సమాచారం తెలిస్తే వెంటనే సీవిజిల్ ఆప్ లో కానీ,డయల్ 100 కి కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ వారికి కానీ సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Previous పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Next పోలింగ్ కేంద్రాల్లో పక్డ్బందిగా ఏర్పాట్లు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
ADVERTISEMENT