| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏపీ అధికార పీఠం ఎవరికో ?

ఏపీ అధికార పీఠం ఎవరికో ?

-  సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్

- యుద్ధం పేరుతో జనసేన టీడీపీ బీజేపీ కూటమి 

- నేడే చివరి దశకు చేరిన ఎన్నికల ప్రచారం

డైలీ భారత్ డెస్క్: ఏపీ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది. ఇన్ని రోజులు ప్రధాన పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించేందుకు అవకాశం లేదు. చివరి రోజు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. అయితే ఈ నెల 13న పోలింగ్ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో ప్రచారం నేటితో ముగియనుంది.సాయంత్రం 5 గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, నేతలు శనివారం సాయంత్రం 6 గంటలలోపే తమ ప్రచారాన్ని ముగించుకోవాలని అధికారులు సూచించారు. అలాగే ఇతర నియోజకవర్గాలకు చెందినవారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారాలు, ప్రకటనలు చేయకూడదు. ఆదివారం ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి అప్పగిస్తారు.. సాయంత్రానికి వారంతా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.

సోమవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తాజా పరిణామాలు.. లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి

రెండో సారి సీఎంగా వైఎస్ జగన్?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధనేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మూడు సభల్లో పాల్గొంటారు. ముందుగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే సభకు ఉదయం 10 గంటలకు హాజరవుతారు. ఆ తర్వాత ఏలూరు జిల్లా కైకలూరు తాలూకా ఆఫీస్ సెంటర్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే సభలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బస్‌స్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభలో మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొంటారు.

సర్వేలో కూటమికి ప్రజాల ప్రాధాన్యత !

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాలలో సభకు హాజరవుతారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు నంద్యాలు చేరుకుంటారు. అక్కడ స్థానిక రాజ్‌ థియేటర్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా గళం సభలో పాల్గొంటారు. అనంతరం నంద్యాల నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు వెళతారు. అక్కడ ప్రజా గళం సభలో పాల్గొంటారు.. అనంతరం అక్కడి నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.

మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇవాళ పిఠాపురం వెళుతున్నారు. చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ముందుగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే చరణ్ బాబాయి పవన్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు మద్దతు తెలుపుతూ వీడియోను కూడా విడుదల చేశారు. అలాగే పలువరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పవన్‌కు మద్దతును ప్రకటించారు.

మరోవైపు పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్లకు సంబంధించి లిస్ట్‌ను ఆర్వో (రిటర్నింగ్ అధికారి)కి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రిసైండింగ్ అధికారికి పోలింగ్ రోజు ఏజెంట్లు తమ వివరాలను సమర్పిస్తే సరిపోతుందంటోంది ఈసీ. అయితే పోలింగ్ ఏజెంట్లను అభ్యర్థి సర్టిఫై చేయాలి.. అలాగే ప్రిసైడింగ్‌ అధికారి సమక్షంలో పోలింగ్‌ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.

Previous పట్టుకుంటారని రూ.2 కోట్లు రోడ్డు పై పడేశారు
Next ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు
ADVERTISEMENT