| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇవ్వాళ తెరుచుకున్న కేదార్‌నాథ్‌ దేవాలయం

ఇవ్వాళ తెరుచుకున్న కేదార్‌నాథ్‌ దేవాలయం

డైలీ భారత్, ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం శుక్ర‌వారం ఉద‌యం తెరుచుకుంది. 

వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంత‌రం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేదారేశ్వరు డికి ముఖ్య‌మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతి ర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. 

ప్ర‌తి యేటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ప‌ర‌మేశ్వ‌రుడి ద‌ర్శ‌నం కోసం కేదార్‌నాథ్‌కు వ‌స్తుం టారు. కానీ, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. 

దాదాపు ఆరు నెలల పాటు ఇలాగే ఆల‌యం మూసి ఉంచ‌డం జ‌రుగుతుంది. నేడు ఆరు నెల‌ల త‌ర్వాత తిరిగి తెరిచిన‌ సందర్భంగా అధికారులు ఆలయాన్ని పువ్వుల‌తో సర్వాంగ సుందరంగా అలంకరిం చారు. 

సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తా బు చేశారు. భక్తులు ఉద యం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు యమునోత్రి ఆలయం కుండా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది..

గంగోత్రిఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకోనుంది. ఇక చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆల యాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు స‌మా చారం...

Previous అంతా మా ఇష్టం మేము చెప్పిందే వేదం... ఇది శ్రీవిద్య స్కూలు యాజమాన్యం తీరు
Next ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT