డైలీ భారత్, సంగారెడ్డి జిల్లా: ఐఐటి హైదరాబాద్ లో చేస్తున్న సేవలు ఎంతో కీలకం. దేశంలో నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులు దృష్టి సారించేలా ఐఐటి హైదరాబాద్ ప్రోత్సాహనా పట్ల గవర్నర్ తమిళ సౌందర్య రాజన్ కితాబు ఇచ్చారు.
సోమవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటి హైదరాబాదులో బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎస్‌ఎన్‌టీ,ని గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ప్రతిభావంతులు, వినూత్నమైన సాంకేతికతతో కూడినవారు. సాంకేతికంగా ఎదగాలని కసి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో బీవీఆర్ మోహన్ రెడ్డి ఇన్నోవేషన్ స్కూల్ వంటి పాఠశాల కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
దేశంలోని విద్యార్థులు ఉద్యోగ ప్రదాతలుగా ఉండాలనీ, ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానన్నారు. మన దేశానికి వినూత్న పారిశ్రామికవేత్తలను రూపొందించడానికి ఈ ఇన్నోవేషన్ స్కూల్ మార్గం చూపుతుందని నేను నమ్ముతున్నానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం బీవీఆర్ సెయింట్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు సాంకేతికతతో నడుస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఆవిష్కరణలు కొత్తతరం వ్యవస్థాపకులకు నాయకత్వం వహిస్తున్న యుగంలో మనం జీవిస్తున్నామన్నారు.
అనేక స్టార్టప్‌లు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నాయని, దీనివల్ల వేలాది మందికి ఉపాధి ఏర్పడుతోందన్నారు. బీవీఆర్ సెయింట్ పాఠశాల ఐఐటి హైదరాబాద్ లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్‌మెంట్‌తో పాటు బ్యాచిలర్స్, మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు సర్టిఫికేషన్ కోర్సులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటిహెచ్‌లో బీవీఆర్ సైంట్‌ను సైయెంట్ ఫౌండేషన్ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు