డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 35 ఏండ్లుగా ప్రైవేటు,ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సేవలందించి కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ఆంగ్ల స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్డ్ అయిన మల్లారపు పురుషోత్తం ని ఈ రోజు జిల్లా విద్యాధికారి ఎ. రమేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి ,సన్మానించారు. ఉపాధ్యాయులుగా,సామాజిక కార్యకర్తగా,ఉపాధ్యాయ సంఘ నాయకుడు గా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని,పురుషోత్తం ఎక్కడ పనిచేసిన ఆ పాఠశాల అభివృద్ధికి నిరంతరం తపించారని,మారుమూల ప్రాంతాల్లో వారి ఆసుపత్రి అధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు సేవలందించారని అన్నారు.నేటి తరం ఉపాధ్యాయులు పురుషోత్తం ని ఆదర్శంగా తీసుకోవాలనీ,వృత్తి నిబద్ధతతో పని చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని,మానవ సేవయే మాధవ సేవ అని భావించి అనేక సేవా కార్యక్రమాల్లో పురుషోత్తం చురుకుగా పాల్గొన్నారని అన్నారు.
ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ...
10 వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెపుతూ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టానని తర్వాత ప్రైవేటు పాఠశాల స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించానని, ప్రభుత్వ పాఠశాల లో ఉపాధ్యాయుడు గా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం సంతోషాన్ని కలిగించిందని, నేను చదువుకున్న బడిలోనే ఉపాధ్యాయునిగా పని చేసి అదే పాఠశాలలో రిటైర్డ్ కావడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. మా అబ్బాయి డాక్టర్ సత్యాన్వేష్ దంత వైద్యులు కావడం తో మారుమూల గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపు లు నిర్వహించి ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగిందని నా సేవలను గుర్తింపుగా అభినందించి సన్మానించిన జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.