| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యాసంస్థల కు బాంబు బెదిరింపు

విద్యాసంస్థల కు బాంబు బెదిరింపు

ఢిల్లీ లో 12 విద్యాసంస్థల కు బాంబు బెదిరింపు

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పలు పాఠశాల లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 12 పాఠశాల లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. 

స్కూళ్లలో బాంబులు పెట్టిన ట్లు ఈ మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. బాంబు బెదిరింపులు ఎదుర్కొన్న స్కూళ్లలో మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురి లోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి.

స్కూళ్లను ఖాళీ చేయించి తనిఖీలు చేసిన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు విదేశాల నుంచి వీపీఎన్ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

వరుసగా బాంబు బెదిరింపు లు రావడంతో దీనిపై అప్ర మత్తమైన పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.కాగా, దేశం లో ఎన్నికల వేళ రెండు రోజుల క్రితం భారత్‌లోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇందుకు సంబంధించిన ఈ-మెయిల్స్ కలకలం రేపాయి. ఇప్పుడు స్కూళ్లకు కూడా అదే రీతిలో బెదిరిం పులు రావడం గమనార్హం...

Previous ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగర్జన సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
Next ఖమ్మంలో తనిఖీలు ... 15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు
ADVERTISEMENT