డైలీ భారత్, సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లో బీఆర్ ఎస్ పార్టీ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి శనివారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరగా, అతనికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...