| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేతన్నల ఆకలి చావులకు సర్కార్ దే బాధ్యత? : కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఫైర్

నేతన్నల ఆకలి చావులకు సర్కార్ దే బాధ్యత? : కాంగ్రెస్ పై  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఫైర్

నేతన్నలు చస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?

రూ.50 కోట్ల నిధులెందుకు ఇంకా విడుదల చేయలేదు?

కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

బకాయిలన్నీ విడుదల చేసేదాకా పోరాడతాం

కాంగ్రెస్ పై  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఫైర్

ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి పరామర్శ  

ఆ కుటుంబానికి రూ.50 వేల ఆర్దిక సాయం అందజేత

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమా దేవి మండిపడ్డారు. పనిలేక నేతన్నలు పస్తులుంటూ ఆత్మహత్య చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నేతన్నల ఆత్మహత్యలకు రాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలని, వెంటనే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసింది.  ఈరోజు సిరిసిల్ల విచ్చేసిన రాణి రుద్రమ ఆత్మహత్య చేసుకున్న ఈగరాజు కుటుంబాన్ని పరామర్శించింది. నేతన్న మరణవార్తను తెలుసుకున్న బండి సంజయ్ ఆ కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు ఆర్దిక సాయం అందించాలని చేసిన సూచన మేరకు రాణి రుద్రమ రూ.50 వేల ఆర్దిక సాయం అందించారు. నేతన్నలెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు… అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ సర్కార్ తోపాటు ప్రస్తుత రేవంత్ సర్కార్ తీరుపైనా విరుచుకుపడ్డారు..

‘‘సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ ఉపాధి చూపలేదు.. కాంగ్రెస్ సర్కార్ కూడా పూర్తి నిర్లక్ష్యం… బతుకమ్మ చీరెల పేరుతో పస్తులుంచారు. బిచ్చమెత్తుకున్నరు.. ఆకలితో ఆత్మహత్య చేసుకుంటున్నరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్లను ఎందుకు ఆదుకోవడం లేదు? శాశ్వతంగా ప్రభుత్వం ద్వారా  ఆర్డర్లు ఎందుకు ఇవ్వడం లేదు.. చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తరు? సర్కార్ లో ఉండి ఏం చేస్తున్నరు? మనుషులు చస్తున్నా పట్టించుకోరా? తక్షణమే చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి.’’అని డిమాండ్ చేశారు.

‘‘మొన్న విడుదల చేసిన రూ.50 కోట్ల నిధులను ఇంకా ఎందుకు ఇవ్వలేదు.. పూర్తి బకాయిలు ఇవ్వకపోతే బండి సంజయ్ మరోసారి పోరాటానికి సిద్దం.’’అని హెచ్చరించారు.


‘‘నేతన్నలారా… ప్రాణం పోతే మళ్లీ రాదు.. ఇంటి పెద్ద చనిపోతే భార్యాపిల్లలంతా అనాథలైతరు. కొంచెం ఓపిక పట్టండి. ధైర్యంగా ఉండండి. శాశ్వత పని దొరికేలా బీజేపీ పోరాడుతుంది…’’అంటూ భరోసా ఇచ్చారు.

Previous ఇందిరమ్మ రాజ్యం అంటే గురుకుల హాస్టల్స్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోవడమేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ? : మారవేణి రంజిత్ కుమార్
Next ఆరు గ్యారెంటీల అమ‌లుకు నాదే హామీ! : గడ్డం రంజిత్ రెడ్డి
ADVERTISEMENT