డైలీ భారత్, న్యూ ఢిల్లీ : దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ఈరోజు ప్రదానం చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో అట్ట హాసంగా కొనసాగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం లో.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.
రాష్ట్రపతి ముర్ము.. పద్మ విభూషణ్ అవార్డును వెంకయ్యనాయుడుకు అందజేశారు. ఈ కార్యక్ర మానికి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు...