| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానేపల్లి గ్రామంలో రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం పాల్గొన్న ఆవుల రాజు రెడ్డి

మానేపల్లి గ్రామంలో రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం పాల్గొన్న ఆవుల రాజు రెడ్డి

డైలీ భారత్, వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే నీళ్ళు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా లేడు రెండవ రోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు పెద్ద ఎత్తున మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ రేణుక మాత ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Previous 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్
Next అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి
ADVERTISEMENT