| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ గా దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ గా దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు

పాల్గొన్న ముస్లిం పెద్దలు

రంజాన్ కృతజ్ఞతలు తెలిపిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డా భాగ్యరాజ్ స్వర్ణలత

డైలీ భారత్, చేగుంట: రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం చంధాయిపేట లోని ఈద్ -గా  దర్గా లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ఈ సందర్భంగా  మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని,  రంజాన్ పండుగ సందర్భంగా యావత్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందాయీపేట గ్రామ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
Next మనువాదంపై మహోద్యమమే మహాత్మా పూలేకు ఘనమైన నివాళి
ADVERTISEMENT