| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ఆరు గారంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది 

 కెసిఆర్ ని ఎందుకు గెలిపించుకోలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు 

కాంగ్రెస్ ప్రభుత్వంలో నీరు లేదు, కరెంటు కోతలు మాత్రమే

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే గార్డెన్ లో నిర్వహించిన సన్నాహక సభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గౌ గణేష్ బిగాల గారు, గౌ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు హాజరై మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీరు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు 

నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుంది 

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ ని ఇస్తున్నారు. తులం బంగారం ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చారా 

అనేక సమస్యలతో ప్రజలు బాధలు పడుతుంటే ప్రజల సమస్యలు పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు 

బిజెపి ప్రభుత్వం ఎంపీగా ఉన్న అరవింద ్ జిల్లాకు చేసింది ఏమీ లేదు పసుపు బోర్డు పేరుతో ఎంపీగా గెలిచిన అరవింద్ మళ్లీ అదే పేరుతో గెలవాలని చూస్తున్నారు 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు గెలవలేదు అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు 

కెసిఆర్ ని ఎందుకు గెలిపించుకోలేక పోయామని మదన పడుతున్నారు 

అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించి ఢిల్లీలో గొంతును వినిపించాలన్నారు 

కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలకు ఎంపీ సీట్లతో బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా ప్రజలు 6 గ్యారంటీలను ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీస్తూ పశువు బోర్డు ఇవ్వని అరవిందును నిలదీస్తూ బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి 

ఈ కార్యక్రమం లో మేయర్ దండు నీతూ కిరణ్ గారు,VG గౌడ్ గారు,సిర్ప రాజు,దారం సాయిలు, సుజిత్ ఠాకూర్,సుదాం రవిచందర్ సత్యప్రకాశ్, ప్రభాకర్ రెడ్డి,ఎనగందుల మురళి, పంచరెడ్డి సురేష్, ప్యాట సంతోష్,మధుకర్ రెడ్డి, విట్ఠల్,రామకృష్ణ,పవన్, తదితరులు పాల్గొన్నారు

Previous మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Next రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్ గా దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు
ADVERTISEMENT