హైదరాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవిం చింది.
బండ్లగూడ రత్నదీప్ సెలక్ట్ సూపర్ మార్కెట్‌లో మంట లు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివా రం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బం ది,ఆ మంటలను చూసి పరుగులు తీశారు. మంట లకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది.
ఈ క్రమంలో రత్నదీప్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం తో అందరూ ఊపిరి పీల్చు కున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.