డైలీ భారత్, తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారున్ని గుర్తుతెలియని ఆటో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బోడ సురేష్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల వైపు వెళుతున్న సమయంలో వెనుక నుండి గుర్తుతెలియని ఆటో ఢీకొట్టడంతో ఆ వ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రుని హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఉమా, నాలుగు సంవత్సరాలకుమారుడు శ్రీ హర్షిత్ లు ఉన్నారు.