| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం

పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కెసిఆర్ నగర్ మండే పల్లిలోని డబుల్ బెడ్ రూం లలో పద్మశాలి ఆఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని పోపా సభ్యులు ఏం. ఇ. ఓ. దుస రఘుపతి ప్రారంభించినారు.

ఈ కార్యక్రమాన్ని సరయు హాస్పిటల్ సౌజన్యంతో పోపా డాక్టర్స్ డాక్టర్ తడుక సాయి కుమార్, పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ తాటిపాముల రవళి స్త్రీ వ్యాధి నిపుణులు, డాక్టర్ గాదర్ల దీప్తి వైద్య సేవలు అందించారు

350 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ మాట్లాడుతు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు. పౌస్టికాహారం తీసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.

జీవన శైలి వ్యాదులైన బి.పి. షుగర్, క్యాన్సర్ లను ఎదుర్కొనేందుకు మంచి అలవాట్లను కల్గి వుండాలని అన్నారు.


డాక్టర్ సాయికుమార్ మరియు రవళి లు మాట్లాడుతూ మహిళలో, పిల్లలలో రక్తహీనత ఎక్కువగా వున్నదని అన్నారు.

దాన్ని అధిగమించేందుకు పౌష్ఠికాహారం తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమం లో పోపా ప్రతినిదులు వాసాల హరిప్రసాద్, బొల్లి భగవాన్, కొడం రాం ప్రసాద్, అలువాల ఈశ్వర్, దాసరి తిరుమల,గాజుల ప్రతాప్, దుస రఘుపతి, దుసా శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, ద్యావన పల్లి పరమేశ్వర్, కారంపూడి రాజేశం, కనుకుంట్ల మధు, ఘడీల రమేష్, గడ్డం సత్యం, కాశీరాం, శివరాత్రి శంకర్, బైరీ రవీందర్, శేకర్, లక్ష్మణ్, సత్యనారాయణ, గ్రామ ప్రతినిదులు మొదలగు వారు పాల్గొన్నారు.

Previous చేవేళ్ళ ప్రాంత అభివృద్ధియే నా కర్తవ్యo : ఎంపి రంజిత్ రెడ్డి
Next ఆటో ఢీకొని వ్యక్తి మృతి
ADVERTISEMENT