| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రతీ ఒక్క హిందువు చూడాల్సిన సినిమా "రజాకార్"

ప్రతీ ఒక్క హిందువు చూడాల్సిన సినిమా "రజాకార్"

హైదరాబాద్ చరిత్రను వక్రీకరించిన గత ప్రభుత్వాలు

17 సెప్టెంబర్ తెలంగాణా విమోచన దినోత్సవ చరిత్రను వెలుగులోకి తెచ్చింది భారతీయ జనత పార్టీ

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

తెలంగాణా విమోచనం కోసం అసువులు బాసిన వీరుల త్యాగం మరువలేనిది

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ సహకారంతో ఆదివారం షాద్ నగర్ రామకృష్ణ థియేటర్ లో "రజాకార్" సినిమాను ఆదివారం స్థానిక బిజెపి నాయకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, దేపల్లి అశోక్ గౌడ్, నందిగామ వెంకటేష్ దేశ్ముఖ్, భూపాల చారి, వెంకటేష్ గుప్త, వంశీ కృష్ణ, చెట్ల వెంకటేష్,శివ కృష్ణ ముదిరాజ్ , మోటె శ్రీను, మల్చలం మురళి, హరి భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా

నెల్లి శ్రీవర్ధన్ రెడ్డిమాట్లాడుతూ

దాదాపు 90 సంవత్సరాల సుధీర్ఘ పోరాటం తర్వాత ఆగస్టు 15 1947 న భారతదేశానికి స్వాతంత్రం లభించి, భారతీయులందరూ సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ చరిత్రలో చెరపలేని రక్తపు మరక రజాకార్ల దురాగతమని అన్నారు. తెలంగాణ మహిళలు, ప్రజలపై విచక్షణారాహిత్యంగా దాడులు జరిపారని, పేద ప్రజల సంపదను దోచుకుంటున్న సందర్భాలను రజాకార్ సినిమా లో కళ్ళకు కట్టినట్టు చూపించారాని అన్నారు. నిజాం నిరంకుశంత్వ రజాకార్లు పాకిస్తాన్ ముస్లింలతో కలిసి తెలంగాణను మొత్తం ముస్లిం లుగా మార్చాలకున్న సందర్బంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బంధగి, రామ్ చందర్ లాంటి ఎంతో మంది పోరాటయోధులు అమరులయ్యారని, పోరాట యోధుల చరిత్ర తెలుసుకొని సర్ధార్ వల్లభాయ్ పటేల్ పొలో ఆపరేషన్ నిర్వహించి నిజం మెడలు వంచి  1948 సెప్టెంబర్ 17 న హైద్రాబాద్ సంస్థానం కు విముక్తి లభించింది అని అన్నారు 

ఆ పోరాట స్ఫూర్తియే తెలంగాణా ఏర్పాటుకు కారణమని అన్నారు.

భవిష్యత్ తరాలకు కూడ తెలంగాణా గడ్డకు పోరాట స్ఫూర్తి ఉంది అని తెలియజేయడమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. గత కాంగ్రేస్ ,కెసిఆర్ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం ప్రభుత్వం చరిత్ర ను వక్రీకరించాయని, రజాకార్ల దురాగతాలను నేటి యువత కు తెలియకుండా చేశాయని అన్నారు. ప్రతీ ఒక్క హిందువు చూడాల్సిన సినిమా అని అన్నారు. తెలంగాణా విమోచన దినోత్సవ చరిత్ర ను వెలుగులోకి తీసుకొచ్చింది భారతీయ జనత పార్టీ అని, అదేవిదంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించడం అభినందనీయం అని అన్నారు. నేటి యువత చరిత్ర ను తెలుసుకోవాలని, అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు.

అదేవిదంగా రజాకార్ సినిమా డైరెక్టర్ యాట సత్య నారాయణ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా

అందే బాబయ్య మాట్లాడుతూ ఆనాడు తెలంగాణా విమోచనం కోసం అసువులు బాసిన వీరుల త్యాగం మరువలేనిదని అన్నారు. రజాకార్లు హిందూ మహిళలపై చేసిన దాడులను, ఆకృత్యలను రజాకార్ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారని, ప్రతీ ఒక్క హిందువు చూడాలని, చరిత్ర ను తెలుసుకోవాలని అన్నారు. అదేవిదంగా సెప్టెంబర్ 17 న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు దొడల వెంకటేష్ యాదవ్, మంగలి రమేష్, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Previous ట్యాక్సీ, ఆటోవాలాల నయా దందా.....నడిచివేళ్లే భక్తులకు దక్కని టోకెన్లు
Next ఫోన్ ట్యాపింగ్ కేసులో A-1 ముద్దాయిగా మాజీ IPS ప్రభాకర్ రావు?
ADVERTISEMENT