| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫరుక్ నగర్ ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రిస్

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫరుక్ నగర్ ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రిస్

ఎంపీపీ ఇధ్రిస్ కు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఫరూక్ నగర్ మండల ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రిస్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో ఇద్రిస్ తోపాటు ఆయన వెంట వచ్చిన సుమారు 100 మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇద్రిస్ పార్టీలో చేరికతో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు జెడ్పిటిసిలు పి. వెంకట్రాంరెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మరో ఎంపీపీ కూడా పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బాగా బలం పుంజుకుంటుంది. అంతేకాదు మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా లాభం చేకూరి అంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

Previous జీవితం అంటే నిన్నునువ్వు తయారుచేసుకోవటం... అపురూపమైన జీవిత ప్రయాణాలు కదా
Next ట్యాక్సీ, ఆటోవాలాల నయా దందా.....నడిచివేళ్లే భక్తులకు దక్కని టోకెన్లు
ADVERTISEMENT