| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి:ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి:ఇద్దరు మృతి

డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు  మండలం అనకాపల్లి లో ఎలుగు బంటి భీభత్సం సృష్టించింది.ఈ ఎలుగు బంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో మహిళ కు గాయాలు అయ్యాయి.

మృతులు అప్పికొండ కూర్మారావు (45 ) సిడి పల్లి లోకనాధం (46) గా గుర్తిం చారు అధికారులు. జీడి తోటలో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల పై దాడి చేసి చంపేసింది ఎలుగుబంటి. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు.

అలాగే…అటవీశాఖ అధికారుల పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Previous శ్రమిస్తే విజయం మీదే.. : మహతి ట్రెడిషనల్ డే వేడుకలో కమిషనర్ లావణ్య
Next ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ADVERTISEMENT