| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి నుదిటి పై గాయం : ఆస్పత్రికి తరలింపు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి నుదిటి పై గాయం : ఆస్పత్రికి తరలింపు

డైలీ భారత్, పశ్చిమబెంగాల్:పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం  ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యా లను ఆ ఫొటోలో కనిపించాయి.

మమత ఇంట్లో గాయపడ్డా రని తెలుస్తోంది. వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మమతా బెనర్జీకి పెద్ద గాయమైందని.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది.

Previous తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్
Next ఎలికట్ట భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు
ADVERTISEMENT