| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

డైలీ భారత్, జైసల్మేర్‌: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఓ తేజస్‌ (Tajas) యుద్ధ విమానం నేలకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు..

అప్రమత్తమైన పైలట్‌ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేసినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు వెలికితీసేందుకుగానూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వాయుసేన తెలిపింది..

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన యుద్ధ విమానాల్లో "తేజస్‌" ఒకటి. 2016లో దీన్ని వాయుసేనలోకి చేర్చారు. 2001లో తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ మొదలు.. తేజస్‌ కూలిపోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో "భారత్ శక్తి" పేరిట సైనిక విన్యాసాలు కొనసాగుతోన్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

Previous కాంగ్రెస్‌, భారాస, మజ్లీస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా
Next ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు
ADVERTISEMENT