| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు ఖాయం

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా సమావేశం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" ధీమా వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు మక్తల్ వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ చిన్నారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయిందని, ఆనాడు టిఆర్ఎస్ పేరున గెలిచిన నాయకులకు బిఆర్ఎస్ గా మారిన తర్వాత వారు ఆపార్టీలో ఇమడలేక పోతున్నారని, అందుకే వారంతా కాంగ్రేస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రేస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఎంపి అభ్యర్థులు దొరకడం లేదని, సిటింగ్ లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు సుముఖంగా లేరని, కొందరు సిటింగ్ ఎంపిలు కూడా మా కాంగ్రేస్ పార్టీ వైపు చూస్తున్నారని, అంతే కాదు కేసీఆర్ కుటుంబంలోని కొందరు నాయకులు కూడా కాంగ్రేస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అన్యాయానికి ఆయన చెప్పారు. చేసిన పనులకు కూడా బిల్లులు రాక చెల్లింపులు లేక అనేకమంది ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన

గుర్తు చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా స్థానిక

సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా

నేడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. గత 420 పాలనకు దీటుగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సిడబ్యుసి

ప్రత్యేక ఆహ్వనితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి,

మల్లురవి, చిన్నా రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కమీషన్

చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్

పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలి, శబ్ద్ నగర్ నాయకులు ఎంపీటీసీ శ్రీశైలం మైనార్టీ నేత ఇబ్రహీం లింగారెడ్డి గూడా అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Previous రెండు లక్షల బీమా చెక్కును అందజేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Next జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
ADVERTISEMENT