డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడుల ను నిర్వహించాలని ఆదేశిం చింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపింది.
10వ తరగతి పరీక్ష సెంటర్లు కొనసాగే స్కూళ్లలో మధ్యా హ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు ఉండనున్నాయి. అలాగే పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నడవనున్నాయి.