డైలీ భారత్, మహబూబాబాద్: సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అంబరీష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కురవి, మల్యాల లలో ఇంటింటికీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు.
అదేవిధంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి పల్స్ పోలియో రెండవ రోజు ఇంటింటి పర్యవేక్షణలో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, వెంకటేశ్వర్ల కాలనీ, సోనియా గాంధీ కాలనీ, గౌతమ్ బుద్ధ కాలనీ, బ్రిక్ లైన్ జమాండ్లపల్లి, హైరిస్క్ ఏరియాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేసుకున్నారా లేదా అని విచారణ చేశారు. పిల్లలందరికి మొబైల్ టీం ద్వారా చుక్కలు వేయడం జరిగిందని,ఈ రోజు పోలియో చుక్కలు వేసుకొని వారు రేపటి రోజు వేసుకోగలరని తెలిపారు..
ఈ కార్యక్రమంలో కురవి, వైద్యాధికారి విరాజిత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్రిష్ణార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్స్ కె.వి రాజు పురుషోత్తం, హెచ్ ఈ ఓ రామకృష్ణ పాల్గొన్నారు.