డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు సంబంధిత అధికారులకు సూచించారు సోమవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ లో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఎస్పీ ఛాంబర్, గ్రీవెన్స్ సెల్ హాల్, సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్స్, మీటింగ్ హాల్ ,రిసెప్షన్ కౌంటర్ మరియు జిల్లా కార్యాలయ వివిధ విభాగాలకు రూమ్స్ ను పరిశీలించి తుది దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి గార్డెనింగ్,లైటింగ్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రారంభోత్సవనికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వీరి వెంట మైనింగ్ ఏడీ రఘుబాబు, ఫైర్ ఆఫీసర్ వెంకన్న, డిఎస్పీ లు నాగేంద్రచారి, భీంశర్మ, మున్సిపల్ కమీషనర్ లావణ్య, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, తహశీల్దార్ షరీఫ్ మోహినుద్ధీన్, సి.ఐ లు రఘుపతి, కరుణాకర్,పోలీస్ హోసింగ్ బోర్డ్ ఏ. ఈ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.