డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో లహరి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ నెల 7వ తేదీన సిరిసిల్ల,వేములవాడ పట్టణాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అన్నారు..మహా శివరాత్రి జాతర సందర్భంగా 07 తేదీన స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు ధార్మిక, కార్మిక క్షేత్రల అభివృద్ధి మా ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు జిల్లా పరిధిలో విద్య, వైద్యం, రోడ్లు మౌలిక వసతుల కల్పన కి కృషి చేస్తాం అన్నారు జిల్లా పరిధిలో కోసం పరిశ్రమల కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తం అన్నారు జిల్లా ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సిద్దంగా ఉన్నామని,జిల్లా మంత్రుల సహకారంతో అభివృద్ధి లో ముందుకు వెళ్తాం అన్నారు..
News