| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బండిలాగుడు పోటీలను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

బండిలాగుడు పోటీలను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సైసై జోడెడ్ల బండి.....బండి హొయ్ షోకైనా దొరల బండి 

బండిపై వంశీచంద్ రెడ్డిని ఎక్కించుకొని ఎడ్ల బండి సవారీ 

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : సైసై జోడెడ్ల బండి.....బండి హొయ్ షోకైనా దొరల బండి

అన్నట్లు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఏఐసిసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి జోరుగా హుషారుగా బండలాగుడు పోటీల్లో పాల్గొన్నారు. కేశంపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు వారోత్సవాలలో భాగంగా బండలాగుడు పోటీలను వీర్లపల్లి శంకర్ ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, కేశంపేట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశప్ప మండల అధ్యక్షుడు గూడ వీరేశం, శ్రీధర్ రెడ్డి మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Previous మహేశ్వరం అభివృద్ధి పై కెఎల్ఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు
Next బీహార్ వ్యక్తి బొల్లారంలో మృతి...
ADVERTISEMENT