| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి

దక్షిణ తెలంగాణపై  కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి

కృష్ణాజలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే  కేసీఆర్ దద్దమ్మలా చూశారు.. 
బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు

ఇక్కడి నాయకులు చెంచాలుగా పనిచేశారు

దక్షిణ తెలంగాణకు మోసం... ఉత్తర తెలంగాణలో కమీషన్లు

సీడబ్ల్యూసీ స్పెషల్‌ ఇన్వయిటీ వంశీచంద్‌ రెడ్డి

చలో పాలమూరు ఎత్తిపోతల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్నిక రెడ్డి, అనిరుద్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో  : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణాజలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు.జిల్లా ఎమ్మెల్యేలు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే జి మదు సూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కక్షగట్టి, ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని మహబూబ్‌ నగర్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇక్కడి చెంచలుగా వ్యహరించారని మండిపడ్డారు. అలాంటివారు ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తే ప్రజలు తరిమివేస్తారని హెచ్చరించారు.కృష్ణ బేసిన్ నీటిని పెన్నా బేసిన్‌కు ఆంధ్ర నాయకులు తీసుకుపోతున్నా కేసీఆర్ అడ్డుపడలేదని ఆరోపించారు. మూడేళ్ళలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని, తొమ్మిదేళ్లయినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టు పొడవునా నాసిరకం పనులు జరుగుతున్నాయని, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణకు రావలసిన వాటాపై పోరాటం చేయలేదన్నారు. నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే 299 టీఎంసీలకు బదులుగా 577 టీఎంసీల వాటా వచ్చేదన్నారు. కేసీఆర్ డిజైన్ చేసిన కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. ఉత్తర తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి చేసి మేడిగడ్డను బొందల గడ్డగా మార్చారని, దక్షిణ తెలంగాణను మోసం చేశారని వంశీచంద్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు

Previous దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలి:ఎమ్మెల్సీజీవన్ రెడ్డి
Next అవినీతి అధికారులను ఎసిబికి పట్టించిన వారికి రూ. లక్షా బహుమతి
ADVERTISEMENT