| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఒక్క నిమిషం ఆలస్యం కాకూడదు అనేది మూర్ఖమైన నిబంధన -మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు

ఒక్క నిమిషం ఆలస్యం కాకూడదు అనేది మూర్ఖమైన నిబంధన -మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రాలకు అనుమతించము అని చెబుతున్న ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు ఒకసారి ఆలోచించండి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆలస్యం వల్ల పరీక్షకి అనుమతించకపోవడం వలన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని ఇట్టి ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు,సిబ్బంది తమ తమ కార్యాలయాలకు విధులకు వస్తున్నారా అని ప్రశ్నించారు.ఒక్క నిమిషం అసెంబ్లీ,పార్లమెంటు సమావేశాలకు లేటుగా వస్తే ఎందుకు సస్పెండ్ చేయరు ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులకు,రాజకీయ నాయకులకు ఈ ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన వీరికి వర్తించదా అని చట్టాలు ప్రజల సౌలభ్యం కోసం,వారి అభివృద్ధి కోసం ఉపయోగపడాలే కానీ ఇలా ఒక్క నిమిషం ఆలస్యం వచ్చిన పంపించము అనే నిబంధన పెట్టి విద్యార్థుల,అభ్యర్థుల ప్రాణాలు తీసుకునేందుకు కాదనేది ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలి అని అన్నారు.ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన  ఎత్తివేయాలని టీఎన్ఎస్ఎఫ్ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను...

Previous గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతుల ఆందోళన
Next జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్
ADVERTISEMENT