| Daily భారత్
Logo




లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్

News

Posted on 2024-02-25 13:26:49

Share: Share


లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్

డైలీ భారత్, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు రోజుల క్రితం ORRపై పటాన్‌ చెరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఆ రోజు అందుబాటులో లేని కేటీఆర్.. ఇవాళ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు.

లాస్య రోడ్డు ప్రమాదం లో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానని, ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ అమ్మాయిని గత 10,15 రోజులుగా అనేక ప్రమాదా లు వెంటాడాయని, గత ఏడాది  వారి నాన్న ఎమ్మె ల్యే సాయన్న  చనిపోయా రని, ఇప్పుడు ఈమె చనిపో వటం బాధాకరమని కేటీఆర్ అన్నారు.

లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా మని, లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించారని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ వెంట మాజీ హోమ్ మంత్రి, ఎమ్మెల్సీ మహ మూద్ అలీ, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అలా వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజ్, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

కేటీఆర్ రాక నేపథ్యంలో కంటోన్మెంట్ కు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భారీగా చేరుకున్నారు

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >