| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జగ్జీవన్ రామ్, కే టీ ఆర్ కాలనీల సమస్యలపై జిల్లా కలెక్టర్ అద్వైద్ కుమార్ సింగ్ కు వినతి పత్రం

జగ్జీవన్ రామ్, కే టీ ఆర్ కాలనీల  సమస్యలపై జిల్లా కలెక్టర్ అద్వైద్ కుమార్ సింగ్ కు వినతి పత్రం

ఎమ్మార్పీఎస్ దండోరా రాష్ట్ర ప్రతినిధి కొండ్ర ఎల్లయ్య

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ టౌన్ 17వ వార్డు పరిధిలో గల జగ్జీవన్ రామ్ కేటీఆర్ కాలనీల సమస్యలపై జిల్లా కలెక్టర్ అద్వైద్ కుమార్ సింగ్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ దండోరా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ్ర ఎల్లయ్య మాట్లాడుతూ.. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 125 చ గజాల లోపు  ఉన్న నివాస గృహాలకు 58Go ద్వారా పట్టాలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఆన్లైన్ చేసి  అధికారులు పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి ఈ రెండు కాలనీలలో సుమారు 400 కుటుంబాలకు సర్వే చేసి కేవలం 25 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చే మిగతావి ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ రావడంతో నిలుపుదల చేసారని వాటిని వాటన్నిటిని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత రెవిన్యూ  అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అందుకు జిల్లా కలెక్టర్ కు జగ్జీవన్ రామ్,కేటీఆర్ కాలనీలో ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేటీఆర్ కాలనీలో సుమారు 120 కుటుంబాలు గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వారికి మునిసిపల్ శాఖ ద్వారా ప్రతి ఇంటికి హోల్డర్ ఇంటి నెంబర్లు కేటాయించి 2019- 2024 మార్చి  ఇంటి పనులు కట్టినారని లబ్ధిదారుని  పేరు లేకుండా నెంబర్ మాత్రమే కేటాయించడం వలన ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు ఇబ్బంది కలుగుతుందని కావున వారందరికీ పర్మినెంట్ నెంబర్ కేటాయించమని జిల్లా కలెక్టర్ కు కోరగా వారు సంబంధిత మున్సిపల్ శాఖ  వారికి ఆదేశాలు  ఇచ్చినందున కాలనీ ప్రజలందరo జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ.కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు  కొరకు వినతిపత్రం ఇవ్వనైనది. జిల్లా కలెక్టర్ గారితో కలిసిన వారిలో పులి శీను, సిహెచ్ రాధా, కుక్కల సుధ, దేవి, ఉపేందర్, బాలరాజు, సమ్మయ్య, మోతిలాల్, కూరపాటి వేణు, పద్మా రమా,సాలమ్మ తదితరులు పాల్గొన్నారు

Previous కారు బోల్తా... ముగ్గురికి గాయాలు
Next రూ.500కే గ్యాస్ సిలిండర్.. తొలుత మొత్తం ధర చెల్లించాల్సిందే
ADVERTISEMENT