అట్టడుగు కులాల అభ్యున్నతికి బాబా గాడ్గే ఎంతో కృషి
ఘనంగా సంత్ గాడ్గే బాబా 148వ జయంతి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : అంటరానితనం నిర్మూలన కోసం, మూఢనమ్మకాల బారి నుంచి సమాజాన్ని మేలుకొలిపిన గొప్ప యోధుడు కర్మయోగి సంత్ బాబా గాడ్గే అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెమ్ సూర్యారావులు కొనియాడారు. శుక్రవారం ఈమెరకు సంత్ బాబా గాడ్గే 148వ జయంతి వేడుకలను పురస్కరించుకొని బీసీ సమాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ దొంతుల సురేష్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా గాడ్గే తన జీవితాంతం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ భారత్ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఊరికి చీపురుతో ఊరంతా శుభ్రం చేసే వారిని గుర్తు చేశారు. బాబా శ్రమదానం వల్లే స్వచ్ఛభారత్ కు మూలాలు ఏర్పడ్డాయని ప్రశంసించారు. జంతు బలి ఇచ్చే ఆహారాన్ని సమాజం నుంచి తరిమేసిన మహానుభావుడు బాబా గాడ్గే అని, నవ సమాజ నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. సమాజంలోని అట్టడుగు కులాల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు వివక్షతపై బాబా గాడ్గే ప్రశ్నించారని బీసీ సమాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ దొంతుల సురేష్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. అనంతరం జన నాయక్ భారతరత్న కర్పూర్ ఠాకూర్ క్యాలెండరును ఎమ్మెల్యే చేతుల మీద ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో చెక్కలశ్రీశైలం ముదిరాజ్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, శ్రీనివాస్ సాగర మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ బిసిసమాజ్, అందె మోహన్ ముదిరాజ్, ఉషన్న ముదిరాజు మీడియా అధ్యక్షులు బిసి మహబూబ్నగర్, కో కన్వీనర్ సవారీ సత్యం, ఎమ్ వి. రమణ వార్త, శేఖర్, దిడ్డి గోపాల్ నారాయణ్, రమేష్ రోమియో, నక్క బాలురాజు, మాణిక్యం, దాసు, యాదయ్య, శేఖర్, నవీన్ కుమార్, రంజిత్, అక్షయ్, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.