| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్యం పట్ల చర్యలు తీసుకోవాలి : జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ

ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్యం పట్ల చర్యలు తీసుకోవాలి : జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ

జిల్లాలోని పలు పాఠశాలలో అస్వస్థతకు గురవుతున్న విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ

డైలీ భారత్, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు కలుషిత నీటి, మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ వలన ఇబ్బందులకు గురవుతున్న విషయం జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న విషయం పట్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ స్పందిస్తూ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చెప్పటి,నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించే విధంగా పని చేయాలని జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఉపాధ్యాయ సిబ్బందికి ఒక ప్రకటనలో సూచించారు...వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో ఎక్కువగా ఎండల ఉష్ణోగ్రత పెరుగుతున్న కారణంగా, విద్యార్థులకు జాగ్రత్తలను సుచించాలన్నారు..విద్యాశాఖ జిల్లా, మండల అధికార యంత్రాంగం పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలో మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సరితమ్మ ఆదేశించారు.

Previous ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడి నోటీసులు
Next మెదక్ లో 17 దుకాణాల వేలం పాట
ADVERTISEMENT