కే టి దొడ్డి మండలం, నందిన్నే గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాలూక కో - ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ
చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయిలు నెలవారీ పింఛను
10 లక్షలు రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా
డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం కే టి దొడ్డి మండల పరిధిలోని నందిన్నే గ్రామంలో తిరగబడదాం-తరిమికోడదాం
కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల తాలూకా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు...వీరికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో జెండా ఆవిష్కరణ అనంతరం సరితమ్మ మాట్లాడుతూ
ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమాలు పథకాలు అన్ని ఇచ్చింది.
మన ప్రభుత్వానికి తెలుసు మన రైతన్నలు పడే కష్టాలు అందుకే మన ప్రభుత్వం రాగానే రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000రూపాయలు అందిస్తాం.ఇది కేవలం రైతులకే కాదు కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తాం.ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు ఇన్ని సంవత్సారాలు తీసుకున్నా రుణానికి వడ్డీ కిందకే జమ చేశారు రుణమాఫీని.ఇపుడే వెళ్లి బ్యాంకులో రుణాలు తీస్కొండి.ఇంకో రెండు నెలల్లో మన ప్రభుత్వం రాగానే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం.ఇలాగే మన ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నవి.
గ్రామంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా లబ్ధి చేకూరుస్తాను వారికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తు జెండా ఆవిష్కరణ కొనసాగించారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎవరు అధైర్య పడద్దని అందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజి ఛైర్మెన్ బండ్ల చంద్ర శేఖర్ రెడ్డి,అమరావాయి కృష్ణారెడ్డి, గట్టు కృష్ణ మూర్తి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, తిమ్మ రెడ్డి, ఆనంద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజ శేఖర్ రెడ్డి, ఆంజనేయులు,ఎంపీటీసీ గీతా, ఆంజనేయులు, ఇ. రాములు, వెంకటేశ్, రెడ్డి, గిద్దిప్ప, గోతరప్ప, పత్తిరప్ప, గోవింద్, కురవ శ్యామెల్లి, శ్రీనివాసులు, కొండా రెడ్డి, జనార్ధన్, మాచర్ల నర్సింగ్ గౌడ్,రంగస్వామి, శ్రీనివాస్ రెడ్డి, కొండపల్లి ఈశ్వర్,పూడూరు ఈశ్వర్, భాస్కర్ రెడ్డి,రాఘవేంద్ర రెడ్డి,రంగస్వామి,ఆంజనేయులు,శ్రీనివాస్ రెడ్డి , పోడూరు ఎర్రవల్లి వెంకటేశ్వరలు,రాములు,రాజశేఖర్,ఏటీఎం నర్సింహులు, పీకే నరసింహులు,ఆంజనేయులు,నర్సింహ,హరిశంద్ర,రాములు,రామచంద్ర, వెంకట రాములు,ఇమ్మానియల్ , గణేష్, రామ కృష్ణ,ఎకె వెంకన్న, నర సింహాలు, సింగారం పెద్ద ఆంజనేయులు, ఆంజనేయలు, మహేష్, ఎర్ర వల్లి, మల్లేశ్, బోయ వెంకట రాములు, పెద్ద వెంకటరాములు, సవరన్న, గంగోత్రి, సర్వేశ్,వెంకటరాములు,శ్రీను , రవి ,బలరాం, రాములు,రహీమ్,తదితరులు ఉన్నారు.. మరియు గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనీ జెండా ఆవిష్కరణ నీ విజయవంతం చేశారు.