| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీ వర్క్స్ ను సందర్శించిన జిల్లా విద్యార్థులు, గైడ్ టీచర్స్

టీ వర్క్స్ ను సందర్శించిన జిల్లా  విద్యార్థులు, గైడ్ టీచర్స్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇన్స్పైర్ మరియు సైన్స్ ఫేర్ కు జాతీయ స్థాయికి సెలెక్ట్ అయిన 19 ఎగ్జిబిట్స్ హైదరాబాదులోని టీ వర్క్స్ లో జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులోని టీ వర్క్స్ సందర్శించి, వారి ఎగ్జిబిషన్ ప్రదర్శించారు.

జిల్లాలోని విద్యార్థుల ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఈరోజు టీ వర్క్స్, టీ హబ్ లను సందర్శించడం జరిగింది.  వినూత్న ఆవిష్కరణను విధివిధానాలను పూర్తిస్థాయిలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పరిశీలించడం జరిగింది. తర్వాత జిల్లా నుండి విద్యార్థులు తీసుకువచ్చిన ఎగ్జిబిట్స్ ను టీ వర్క్స్ ప్రతినిధులు పరిశీలించి అభినందించారు. వీరిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను, జిల్లా విద్యాధికారిని ప్రత్యేకంగా అభినందించారు.

Previous బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ బానోతు విజయలక్ష్మి
Next అవినీతి జ్యోతి కి రిమాండ్
ADVERTISEMENT