| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మోడల్ స్కూల్ లో పదోవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేసిన లింగారెడ్డి

మోడల్ స్కూల్  లో పదోవ  తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేసిన లింగారెడ్డి

డైలీ భారత్, నరసింహుల పేట ప్రతినిధి: నరసింహుల పేట మండలంలోని మోడల్ స్కూల్లో   విద్యను అభ్యసిస్తున్న పదోవ తరగతి విద్యార్థులకు ఉదయం ప్రత్యేక తరగతులు సాయంత్రం ప్రత్యేకతలు తరగతులు నిర్వహిస్తుండడంతో అల్పారంగా, పౌష్టికాహారం విద్యార్థులకు అందించే లక్ష్యంగా పడమటి గూడెం  గ్రామానికి చెందిన ఈర్రి లింగారెడ్డి సుమారు నాలుగు వేల రూపాయల స్నాక్స్ ప్రిన్సిపల్ ఆనంద్ బాబు సమక్షంలో విద్యార్థులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులకు, గురువులకు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించాలని ఈసారి మానుకోట  జిల్లాలో మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ర్యాంకులు తీసుకొచ్చి మండలానికి పేరు ప్రతిష్టతలు తీసుకురావాలని వారు కోరారు. విద్యార్థులకు ప్రస్తుతం గతంలో కంటే మెరుగ్గా వస్తువులు ప్రభుత్వం కల్పిస్తున్నాయి దానిని ఉపయోగించుకుంటూ ముందు సాగాలని ఉన్నత రంగంలో ఎవరికి నచ్చిన రంగంలో వారు వెళ్లే విధంగా ఇప్పటినుండి లక్ష్యాన్ని అమర్చుకోవాలని వారు అన్నారు. వారి వెంట ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు గౌని యాదగిరి,దోమల యాదగిరి, చిర్ర సతీష్ కాస యా కన్నా, అనిల్ కుమార్,కొంపెల్లి  యాకన్న తదితరులు పాల్గొన్నారు

Previous విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
Next దివంగత సీఎం జయలలిత 27 కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగింత..బెంగళూరు కోర్టు కీలక తీర్పు
ADVERTISEMENT