డైలీ భారత్, మెదక్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్ టర్న్ అవుట్ పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ఓటరు దరఖాస్తులు వంటి పలు అంశాలపై ఆయన సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ ఓటరు జాబితా రూపొందించామని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నూతనంగా నమోదైన ఓటర్ల జాబితా వివరాలను మరోసారి ధ్రువీకరించు కోవాలని ఆయన సూచించారు.
పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించడం జరిగిందని ఓటరు జాబితాలో వచ్చే మార్పులపై ఎప్పటి కప్పుడు స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు విని యోగించుకునే విధంగా వినూత్న రీతిలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఈ వీడియో కాన్పరెన్సులో మెదక్ ఆర్డీఓ అంబ దాసు రాజేశ్వర్,నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు , ఎన్నికల సూపర్ ఇండెంట్ సర్దార్ హార్దీప్ సింగ్ మెదక్ తహశీల్దార్ శ్రీనివాస్ , ఇ డి యం సందీప్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది , ఐటి సిబ్బంది , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.