| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నవ భారతానికి స్ఫూర్తి ప్రదాత చత్రపతి శివాజీ : చందులల్

నవ భారతానికి స్ఫూర్తి ప్రదాత చత్రపతి శివాజీ : చందులల్

ఆరెకటిక సంఘం హిందు వాహిని ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ 394 జయంతి  జయంతి వేడుకలు

ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ ప్రతాప్ లింగం

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : హిందూ హృదయ సామ్రాట్, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు భారతజాతిని సిద్ధం చేసిన మరాఠా యోధుడు,నవ భారతానికి స్ఫూర్తి ప్రదాత చత్రపతి శివాజీ అని చందూలల్ అన్నారు.

షాద్ నగర్ శివాజీ చౌక్ దగ్గర శివాజీ విగ్రహం జయంతి ఉత్సవాలను సోమవారం ఆరెకటిక సంఘం హిందు వాహిని ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెకటిక సంఘం నాయకులు చందు లల్ , షాద్ నగర్ పట్టణ సీఐ ప్రతాప్ లింగం పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు చత్రపతి శివాజీ భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ.. స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు కొనియాడారు. పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ  సంధర్భంగా చందులల్ మాట్లాడుతు గెరిల్లా యుద్ధనీతితో మొగలులు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన.. శివాజీ పోరాట పటిమ, తెగువ, స్వరాజ్యం, సుపరిపాలన కోసం వారు చూపిన మార్గదర్శనం నేటికీ స్ఫూర్తి దాయం.

ఈ కార్యక్రమంలో ప్రకాష్, బాలాజీ, శ్యామ్ ,ఆరెకటిక సంఘ సభ్యులు హిందు వాహిని సభ్యులు పాల్గొన్నారు.

Previous వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు చత్రపతి శివాజీ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Next మరమత్తు పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT