| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు చత్రపతి శివాజీ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు చత్రపతి శివాజీ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, వేములవాడ: వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు చత్రపతి శివాజీ అని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు..

సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి వేడుకలను పునస్కరించుకొని  జయవరం,అయ్యోరు పల్లి గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు..చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు.యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడు అని కొనియాడారు..

స్వరాజ్య కాంక్షను రగిలించి చరిత్ర పుటల్లో సువర్ణాధ్యాయంగా నిలిచిన యోధుడు అన్నారు..భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడని ,భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు అన్నారు..


చత్రపతి శివాజీ మహారాజ్ ను నేటి యువతరం యువకులు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకెళ్లాలని సూచించారు..

Previous రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
Next నవ భారతానికి స్ఫూర్తి ప్రదాత చత్రపతి శివాజీ : చందులల్
ADVERTISEMENT