డైలీ భారత్, తూప్రాన్:మెదక్ జిల్లా తూప్రాన్ లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ సీనియర్ ఉద్యమ నాయకులు మన్నే శ్రీనివాస్ రావు, టిఆర్ఎస్ నాయకులు కుమ్మరి రమేష్ , నర్సాపూర్ చౌరస్తా లోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.శివాజీ దేశానికీ చేసిన సేవలను కొనియాడారు జిల్లా బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి హిందూ సామ్రాజ్యానికి మహారాజు చత్రపతి శివాజీ వీరుడు ధీరుడు ధైర్యవంతుడు అని ఈ సందర్భంగా యువత చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలని భారతదేశానికి మరియు హిందువుల ఆరాధ్య దైవం చత్రపతి శివాజీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె శ్రీనివాసరావు, కుమ్మరి రమేష్, మెదక్ జిల్లా బి సి సంఘము ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లిఖార్జున్ గౌడ్, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జయపాల్, 15వ వార్డు అధ్యక్షులు బాయికాడి ఆంజనేయులు, 12వ వార్డు అధ్యక్షులు గంగాధర్ వెంకటేష్, యాదవ్ మహా సభ జిల్లా ఉపాధ్యక్షులు బండ నాగరాజు యాదవ్, బీసీ రాష్ట్ర నాయకులు వెంకటొల్ల శివకృష్ణ గౌడ్, బందెల నరేష్, గడ్డం వెంకటేష్, గొల్లపల్లి నరేష్ రెడ్డి, శ్రీనివాసరావు, స్వామితదితరులు పాల్గొన్నారు.