| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎస్టీలకు అండగా కాంగ్రెస్

ఎస్టీలకు అండగా కాంగ్రెస్

ఇందిరమ్మ పోడుభూములు ఇస్తే కేసీఆర్ కొల్లగొట్టారు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

రిజర్వేషన్లు కల్పించింది - విద్య - వైద్యం ఉచితంగా అందించి గిరిజన సంక్షేమానికీ ఆపన హస్తమే

కెఎల్అర్, టికెఅర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఘనంగా 285వ సేవాలాల్ జయంతోత్సవంలో పాల్గొన్న కెఎల్అర్, టికెఅర్.

మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవంలో ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కలిసి పాల్గొన్నారు. 

మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండాలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొని... ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. 

అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి కందుకూరు మండలం కేంద్రంలో జరిగిన సేవాలాల్ ర్యాలీలో పాల్గొన్నారు కేఎల్ఆర్, టీకేఆర్. 

ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ... గిరిజన సంక్షేమానికి నాడు - నేడు పాటుపడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 

సంచారం చేస్తున్న అడవిబిడ్డలకు పోడు భూములు ఇచ్చి వ్యవసాయం వైపు మళ్లిపిందే నాటి ఇందిరమ్మ అని గుర్తు చేశారు. తండాల ఏర్పాటు, విద్య - వైద్యం కల్పించి గిరిజన జాతిలో అవగాహన కల్పించిన ఆరాధ్యదైవం సేవాలాల్ కు హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తిగా ప్రతిఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. 

ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాలు పాల్గొన్నాయి.

Previous సేవలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గోన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Next వివాహానికి ఆర్థిక సాయం
ADVERTISEMENT