డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను, అమ్మకాన్ని నిపివేయాలని మరియు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16 న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) సంపూర్ణంగా బలపరుస్తున్నది.
కేంద్రప్రభుత్వ విధానాలతో కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతోపాటు మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు,
ఉద్యోగ భద్రత లేదు.
ఏళ్ళ తరబడి కాంట్రాక్ట్,
ఔట్ సోర్సింగ్ పద్దతిలో కొనసాగిస్తున్నారు.
గత పదేళ్ళలో ఆదాయపన్ను స్లాబులను సవరించలేదు, రాయితీ మొత్తాన్ని పెంచలేదు. అన్ని వస్తువులపై జిఎస్టీ వసూలు చేస్తూ వేతన జీవులపై ఆదాయపన్ను భారాన్ని అధికంగా మోపి, కార్పొరేట్లకు మాత్రం పన్నుల్లో రాయితీలు కల్పించారు.
రైతులు, కార్మికుల సమస్యలతో పాటు ఆదాయపన్ను శ్లాబులు సవరించాలని, రాయితీ పరిమితిని పెంచాలని, CPS & PFRDA లను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, NEP -2020 ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ…
సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బందుకు మద్దతుగా శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం దాసరి రవీందర్ శ్రీహరి లక్ష్మయ్య సమ్మయ్య దేవత ప్రభాకర్ నశీరుద్దీన్ సాంబయ్య అజయ్ లింగమూర్తి వెంకటేష్ నారాయణ ఫాతిమా సంధ్యారాణి నీరజ సరిత రజిత మొదలైన వారు పాల్గొన్నారు