16న కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
డైలీ భారత్, తెలంగాణ: గత 18 సంవత్సరాలుగా ప్రజానికానికి అనేక రకాలుగా సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు నేటికీ ఫిక్సడ్ వేతనం నిర్ణయించకపోవటం దారుణమని, వెంటనే పిక్సడ్ వేతనం నిర్ణయించాలని ఈ నెల 16న జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కోరారు. ఆదివారం జగన్నాధం భవనంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా విస్తృత సమావేశం అసియా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆశా కార్యకర్తలకు గత రెండు నెలల పెండింగ్ పారితోషకాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ. 26000/-చెల్లించాలని, ANCల టార్గెట్ పేరుతో ఆశాలపై వేధింపులు అరికట్టాలని, ప్రమాద భీమా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన ఆశాలకు రూ. 10,000/- పెన్షన్ చెల్లించాలని, 45వ ILC సిఫారుసుల ప్రకారం ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం, మౌలిక సదుపాయాలు కల్పించాలని, PHC లలో మంచినీటి సౌకర్యం, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, NHM కు నిధులు పెంచి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్కీం వర్కర్ల పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా, లేబర్ కోడ్ ల రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తదితద 18 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16న జరుగుతున్న దేశ వ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ లో ఆశా వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా కన్వీనర్ గా ఉపేంద్ర
అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ గా వడ్లకొండ ఉపేంద్ర ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పోతుగంటి మల్లయ్య వివిధ పిహెచ్చీసీల ఆశా లీడర్లు అసియా, రమ, జ్యోతి, కవిత, స్వరూప, శకుంతల, కౌసల్య, శారద, లత, రమాదేవి, అరుణ, విజయ తదితరులు పాల్గొన్నారు.