డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు ఆదేశాల మేరకు
ఈ రోజు జిల్లా కమీటీ ముఖ్య నాయకుల సమావేశం...
జిల్లా ఉపాధ్యక్షులు దండ్ల వంశీకృష్ణ అధ్యక్షతన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్ విచ్చేసి వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచింది. ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ వడ్డెర్ల బతుకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు వడ్డెర్ల బతుకులు మారి వారి జీవితాల్లో మార్పు రావాలంటే
ఈ అసెంబ్లీ సమావేశంలో వడ్డెర కులాన్ని బీసీ నుండి తొలగించి ఎస్టి జాబితాలో చేర్పించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలని చదువుకునే వడ్డెర విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో చదివారు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో 20 శాతం EMD లేకుండా పనులు కేటాయించి బండ క్వారీలపై వడ్డెర్లకు పూర్తి హక్కు కల్పించాలి వడ్డెర జనాభా ప్రాతిపాదికన రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షులు యాపకాయల సంతోష్ జిల్లా కార్యదర్శి శివరాత్రి అయిలయ్య లీగల్ అడ్వైజర్ బోధస్ రమేష్ జిల్లా కోశాధికారి సూర్య ప్రశాంత్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు పల్లపిశాక్ మండల అధ్యక్షులు కొడదల కొమురయ్య సూర రాము ధన్ల అంజి బత్తుల లక్ష్మణ్ ఆలకుంట దుర్గయ్య శివరాత్రి కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
#sircilla #rajanna sircilla