కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు నెలలు గడవక ముందే నిధులు తెచ్చినందుకు ప్రోటోకాల్ కావాలా
ఖబర్దార్ బి ఆర్ఎస్ నాయకులర
డైలీ భారత్, మెదక్ తోగుట:శుక్రవారం నాడు తొగుట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజు తొగుట మండలంలో దాదాపు 3.33 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు మండల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది, మండలానికి ఎంపీపీ ప్రోటోకాల్ పదవి అని ఎంపీపీ భూమి పూజ చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల సమయంలోనే మండలానికి మూడున్నర కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు రావడం జీర్ణించుకోలేని టిఆర్ఎస్ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు, గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసిన ఈనాటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం ఆయన పదవీకాలంలో కూడా మూడు కోట్ల రూపాయల నిధులు ఇవ్వలేదని, టిఆర్ఎస్ నాయకులకు చేతనైతే ఎమ్మెల్యే ద్వారా మరో మూడున్నర కోట్ల రూపాయలు తెచ్చి మండలంలో అభివృద్ధి పనులు చేయాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు, గత పది సంవత్సరాలు సిద్దిపేట నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేసిన టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు విచిత్రంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అసలు ప్రజాస్వామ్య వాసనలే నచ్చని టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గూర్చి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని వారు విమర్శించారు, ఇకనైనా సోయి తెచ్చుకొని మండల అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో తొగుట మండల మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్,మాజీ సర్పంచులు పాగాల కొండల్ రెడ్డి,బుర్ర నర్సింలు,కొంగరి నర్సింలు, ఐ ఎన్ టి యు సి నియోజక వర్గ అధ్యక్షుడు బాలమల్లు, కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనాకర్ రెడ్డి, జిల్లా నాయకులు పబ్బతి మల్లా రెడ్డి, యెన్నం భూపాల్ రెడ్డి, బుస నిరంజన్ రెడ్డి, మండల నాయకులు ఉప్పలయ్య, మధు, ముక్కెర కనకయ్య, దుద్దేడ యాదగిరి, దయాకర్ రెడ్డి, జయబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు.