| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. పెట్టెలో రూ.2 కోట్ల నగదు

తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. పెట్టెలో రూ.2 కోట్ల నగదు

డైలీ భరత్,వనస్థలిపురం: నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు.

ఆయన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎంఆర్‌ఓ మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

Previous అక్టోబర్ 7 వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు
Next సమక్క సారక్క పేరుతో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ : మోదీ
ADVERTISEMENT