డైలీ భారత్, కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ స్టేజి వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల వివరాల మేరకు
చెన్నై నుంచి రాజస్థాన్ కి వెళ్తున్న లారీ గుట్టపాడు స్టేజి వద్ద నంద్యాల నుండి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక వైపు నుంచి ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీకే రాములకు కాలు విరిగింది. 20మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ప్రయాణీకులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
#accident # kurnool #orvakallu