నషా ముక్త్ భారత్ పాదయాత్రకు సంఘీభావం! ఖైరతాబాద్ లో కీర్తి రెడ్డి!
డైలీ భారత్, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే నషా ముక్త్ భారత్ సాధ్యమన్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి!
రెండో రోజు గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన "నషా ముక్త్ భారత్ పాదయాత్ర" లో పాల్గొని కిషన్ రెడ్డికి సంఘీభావం తెలిపిన కీర్తి రెడ్డి!
భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఈ నషా ముక్త్ భారత్ పాదయాత్రలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపు!
కీర్తి రెడ్డి కామెంట్స్:
ప్రపంచంలో ఏ రంగాన్ని పరిశీలించినా భారతీయ యువత తమ ప్రతిభతో సేవలు అందిస్తున్నారు!
మన భావితరాలు డ్రగ్స్, మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి!
ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలి!
2029 నాటికి నషా ముక్త్ భారత్ సాధించే దిశగా మనమంతా కృషి చేయాలి!
డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు, భాగస్వాములు కావాలి!
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇలాంటి చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనాలి!
డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై సమాజానికి అవగాహన కల్పించాలి!
యువతను కాపాడుకోవడం అంటే దేశ భవిష్యత్తును కాపాడుకోవడమే!
మన భావితరాలకు సురక్షితమైన, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి!
#DailyBharath #NashaMuktBharat #Khairatabad #KeerthiReddy #KishanReddy #Hyderabad #BJP