డైలీ భారత్, దమ్మన్నపేట: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన 14వ తేదీన శనివారం సెలవు దినం కావడం మూలంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు!
నేడు కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు! అందులో ప్రధానోపాధ్యాయురాలుగా ఈరవేణి నందిని, పీడిగా హర్షవర్ధన్ రెడ్డి వ్యవహరించారు!
ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరూ కూడా చురుకుగా పాల్గొని వారి వారి సబ్జెక్టులను బోధించడం జరిగింది!
ఈ కార్యక్రమంలో నేడు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన వారిలో ఈరవేణి అక్షిత, సంజన, అక్షర, వర్షిత్, రాజ్, రేవంత్, గౌతమ్, సాయికృష్ణ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు!
#DailyBharath #Dammannapet #SelfGovernanceDay #ChildrensDay #StudentsAsTeachers