| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మిక్సింగ్ లిక్కర్ గ్యాంగ్ పట్టివేత! చీప్ లిక్కర్ ను ఖరీదైన బాటిళ్లలో నింపి అమ్మకాలు!

మిక్సింగ్ లిక్కర్ గ్యాంగ్ పట్టివేత! చీప్ లిక్కర్ ను ఖరీదైన బాటిళ్లలో నింపి అమ్మకాలు!

డైలీ భారత్, షంషాబాద్: బగ్గా డిస్టిలరీలో కొంతకాలంగా పని చేసి, అక్కడ పని మానివేసి క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ డిటిఎఫ్ టీం నరేందర్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు!

వివరాల్లోకి వెళితే...

గత ఆరు నెలలుగా వంగలి అశోక్ (43) అనే వ్యక్తి బగ్గా డిస్టిలరీ మద్యం తయారీ పరిశ్రమలో పని మానివేసి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు!

షంషాబాద్ లోని శాతం రాయి ప్రాంతంలో తన ఇంట్లోనే తక్కువ ధరలు కలిగిన చీప్ లిక్కర్ మద్యాన్ని ఖరీదైన మద్యం బాటిళ్లలో మిక్సింగ్ చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ విచారణలో వెల్లడైంది!

మహమ్మద్ యాకూబ్ పాషా (29) అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణంలో ఖరీదైన మద్యం బాటిల్లను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి మూతలను తొలగించి అందులో రూ 560 విలువ చేసే డౌన్ టెన్ అనే చీప్ లిక్కర్ ను బాటిళ్లలో నింపుతూ అమ్మకాలు సాగిస్తున్నాడని గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు!

చీప్ లిక్కర్ ను ఖరీదైన మద్యం సీసాలో పోసి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు!

ఈ విషయాన్ని పసిగట్టిన కానిస్టేబుల్ ధనుంజయ్ సీఐ కి సమాచారం ఇవ్వడంతో అందరూ కలిసి వెళ్లి దాడి చేసి అశోక్ ఇంట్లో పెద్ద మొత్తంలో మిక్సింగ్ బాటిల్లను, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు!

షంషాబాద్ లోని శాతంబాయి ప్రాంతంలో తన ఇంట్లో దాడులు నిర్వహించగా 10 ఫుల్ బాటిల్లు మిక్సింగ్ చేసిన బాటిల్స్ తో పాటు మరో 30 పైగా ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు!

మద్యం సీసాలను మహమ్మద్ యాకూబ్ పాషా (29) క్యాబ్ దుకాణం నుంచి తీసుకు వస్తున్నట్లు తెలపడంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు!

ఇలా తక్కువ ధర కలిగిన మద్యాన్ని ఖరీదైన జాన్ వెల్స్, జానీ వాకర్, దివార్స్, 100 పేపర్స్ లాంటి ఖరీదైన బాటిల్లో నింపి అమ్మకాలు సాగిస్తున్నారు!

ఇలా చీప్ లిక్కర్ ను మిక్సింగ్ చేసి మద్యం బాటిల్లను స్థానికంగా ఉన్న ఒక పదిమందికి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు! వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు!

ఈ కేసులో సీఐ నరేందర్ తో పాటు ఎస్సై హనుమంతు, నజీర్ పాషా, ఇంచార్జ్ సీఐ భరత్ కుమార్, ధనుంజయ్, అభినయ్, కిషన్, భాస్కర్ ఉన్నారు!

నిందితులను, మిక్సింగ్ మద్యం బాటిల్లను షంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఈఎస్ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు!

మిక్సింగ్ మద్యం ముఠాను పట్టుకున్న డిటిఎఫ్ టీమ్ ను గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ ఈఎస్ విజయ భాస్కర్ గౌడ్ అభినందించారు!

#DailyBharath #Shamshabad #ExciseRaid #MixingLiquor #Hyderabad

Previous దమ్మన్నపేట స్కూల్ లో విద్యార్థులే టీచర్లు! స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా!
Next ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ఘన విజయాలు! జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థి, ఉపాధ్యాయ బృందం!
ADVERTISEMENT